VSP: పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలోని సరిపల్లి చెక్ పోస్ట్ వద్ద శుక్రవారం అక్రమంగా గంజాయి లిక్విడ్ ఆయిల్ తరలిస్తున్న ముగ్గుర్ని పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రూ. 50 వేలు విలువైన 2 కేజీల గంజాయి లిక్విడ్ ఆయిల్, రెండు మోటార్ సైకిళ్లు, నాలుగు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. వారిపై కేసు నమోదు చేశారు.