ఎవరితోనైనా వాదించడానికి ముందు మీకు మీరు ఓ ప్రశ్న వేసుకోండి. ప్రతి విషయంలోనూ విభిన్న కోణాలుంటాయనే భావనను అర్థం చేసుకునేంత పరిపక్వత ఈ వ్యక్తికి ఉందా? అని ప్రశ్నించుకోండి. అది లేనివారితో జరిపే వాదనలు ఘర్షణకు దారితీయడమే తప్ప అక్కడ ఎలాంటి అర్థవంతమైన చర్చకు ఆస్కారం ఉండదని తెలుసుకోండి. ఇలా తెలుసుకోవడం వల్ల మీ సమయం, శక్తి వృథా కావు.