NLG: నాగార్జునసాగర్ జలాశయానికి ఎగువ ప్రాంతం నుంచి వస్తున్న వరదతో ప్రాజెక్ట్ అధికారులు 8 గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేశారు. శుక్రవారం రాత్రి 9 గంటలకు అందిన సమాచారం ప్రకారం.. శ్రీశైలం నుంచి 1,16,793 క్యూసెక్కుల నీరు జలాశయానికి వస్తుంది. సాగర్ నుంచి 8 గేట్లను ఐదు అడుగుల మేర ఎత్తి 64,720 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేసినట్లు తెలిపారు.