ADB: అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ, పీజీ మొదటి సంవత్సరం ప్రవేశాలకు గడువు పొడిగించినట్లు సైన్స్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సంగీత, ఉమ్మడి జిల్లా కో-ఆర్డినేటర్ జగ్రామ్ తెలిపారు. ఈనెల 12 వరకు గడువు ఉండగా 26 తేదీ వరకు పొడిగించినట్లు పేర్కొన్నారు. ఆసక్తి గల ఉమ్మడి జిల్లా విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.