GNTR: మంగళగిరి జాతీయ రహదారి నిర్వహణ పనుల కోసం ఒడిశా నుంచి వచ్చిన దయానంద్ నాయక్ (35) అనే వ్యక్తి శుక్రవారం ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఇతనికి మతిస్థిమితం సరిగ్గా లేదని పోలీసులు పేర్కొన్నారు. తెనాలి ఫ్లై ఓవర్ సమీపంలోని తన నివాసంలో దయానంద్ నాయక్ ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై నాయక్ చెప్పారు.