ATP: అనంతపురం, సత్యసాయి జిల్లాల కలెక్టర్లు ఆనంద్, శ్యామ్ ప్రసాద్ ఈ నెల 15, 16 తేదీల్లో విజయవాడలో జరగనున్న కలెక్టర్ల సదస్సులో పాల్గొననున్నారు. స్వర్ణాంధ్రప్రదేశ్ లక్ష్యాలపై ఈ భేటీలో సీఎం చంద్రబాబు కలెక్టర్లకు దిశానిర్దేశం చేస్తారు. ఈ ఏడాది మార్చి నెల 25, 26న జరిగిన సదస్సులో తీసుకున్న నిర్ణయాలు, వాటి అమలు తీరు, వృద్ధిపై ఈ సదస్సులో చర్చించనున్నారు.