MDCL: ఘట్కేసర్ పరిధిలోని అన్నోజిగూడ ప్రాంతంలో ఓ కార్మికుడు నిర్మాణంలో ఉన్న భవనం నాలుగో అంతస్తుపై నుంచి కిందపడ్డాడు. అదృష్టవశాత్తు కేవలం కాలికి మాత్రమే గాయమై, ప్రాణాలతో బయటపడ్డట్లు స్థానికులు తెలిపారు. భవనం పక్కనే కరెంటు తీగలు ఉన్నాయని, కార్మికుడు కింద పడే సమయంలో కరెంటు తీగలు తాకితే ప్రాణాలు పోయేవని అక్కడి స్థానికులు తెలిపారు.