HYD: Ed. CET 2025 సెకండ్ ఫేజ్ రిజల్ట్ సెప్టెంబర్ 12వ తేదీన ప్రకటిస్తామని అధికారులు తెలియజేసినప్పటికీ ఫలితాలు విడుదల చేయలేదు. దీంతో పరీక్ష రాసి, వెబ్ ఆప్షన్స్ ఎంట్రీ ఇచ్చిన అభ్యర్థులు రిజల్ట్ కోసం వేచి చూస్తున్నారు. దీనిపై HYD తార్నాక ఉస్మానియా యూనివర్సిటీ అధికారులను వివరణ కోరగా, టెక్నికల్ సమస్య కారణంగా ఆలస్యం జరిగిందని, త్వరలోనే రిజల్ట్ ప్రకటిస్తామన్నారు.