ప్రకాశం: కనిగిరిలోని బాలికోన్నత పాఠశాలలో టీచర్ గా పనిచేస్తున్న రంగారెడ్డిని విద్యాశాఖ ఉన్నతాధికారులు బుధవారం విధుల నుంచి తొలగించారు. పాఠశాలలో బాలికలను లైంగికంగా వేధిస్తున్నాడని బాధిత కుటుంబ సభ్యులు PSలో ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఉపాధ్యాయుడిని అదుపులోకి తీసుకున్నారు. అతనిని కఠినంగా శిక్షించాలని ఆందోళనలు ఎక్కువవుతున్న నేపథ్యంలో ఆయనను విధులనుంచి తొలగించారు.