ఎన్టీఆర్: నందిగామ పట్టణం పరిధిలోని కాకాణి నగర్ కార్యాలయంలో గురువారం నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యను మున్సిపల్ చైర్ పర్సన్ మండవ కృష్ణ కుమారి మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం ఎమ్మెల్యేను శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా ఈ నెల 24వ తేదీన జరగనున్న కౌన్సిల్ బడ్జెట్ సమావేశంలో హాజరు కావాల్సిందిగా ఆమెను కోరారు. ఆమె వెంట కూటమి నాయకులు ఉన్నారు.