ATP: వజ్రకరూరు మండలం తట్రకల్లు కేజీబీవీలో ప్రవేశాలకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని కళాశాల ప్రిన్సిపల్ ఎం.ధనలక్ష్మి కోరారు. 6వ తరగతి, ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ప్రవేశాలకు ఈ నెల 22 నుంచి ఏప్రిల్ 11వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. అనాథలు, బడి బయటి పిల్లలు, పేద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ బాలికలు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.