ప్రకాశం: తాడేపల్లి పార్టీ ఆఫీసులో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మాజీ ఎమ్మెల్యేలు అన్నా రాంబాబు, వెంకట్ రెడ్డిలు గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మార్కాపురం నియోజకవర్గంలోని వైసీపీ పార్టీ స్థితిగతుల గురించి జగన్ అడిగి తెలుసుకున్నారు. నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని, ప్రతి కార్యకర్తకు అండగా ఉండాలని సూచించారు.