BPT: జిల్లాకు సంబంధించిన అన్ని మండలాల రేషన్ డీలర్ల ప్రెసిడెంట్స్, సెక్రటరీలతో గురువారం అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో డీఎస్వో ఈబి విలియమ్స్ మాట్లాడుతూ.. రేషన్ కార్డు దారులు ఎవరైతే ఇంకా ఈకేవైసి చేయకుండా పెండింగ్ ఉన్నారో వారు డీలర్లకు సంప్రదించి, ఈకేవైసీ చేయించాలన్నారు. జాబితా ప్రకారము సుమారు 1,17,000 యూనిట్లు మిగిలిపోయినట్లు తెలిపారు.