VZM: సర్దార్ వల్లభాయ్ పటేల్ జన్మదినం పురస్కరించుకొని భారత ప్రభుత్వం చేపట్టిన సర్దార్ @150 కార్యక్రమాలలో యువత భాగస్వామ్యం కావాలని ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు పిలుపునిచ్చారు. బుధవారం స్థానిక మై భారత్ కార్యాలయంలో జరిగిన పత్రిక సమావేశం లో ఎంపీ మాట్లాడుతూ.. అక్టోబర్ 31 నుంచి నవంబర్ 25 వరకు జరగనున్న ర్యాలీలు, వివిధ రకాల పోటీలలో యువత పాల్గోవాలన్నారు.