VSP: విశాఖ రుషికొండపై ఏపీ పర్యాటక అభివృద్ధి సంస్థ నిర్మించిన భవనాల వినియోగంపై జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ బుధవారం అభ్యంతరం వ్యక్తం చేశారు. పర్యావరణ నియమాలు, హైకోర్టు ఆదేశాలను ఉల్లంఘించి ఈ భవనాలను అక్రమంగా ఉపయోగించుకునేందుకు ప్రతిపాదనలు పెట్టారని ఆయన ఆరోపించారు.