VZM: మాజీ సీఎం YS జగన్మోహన్ రెడ్డి జన్మదినం సందర్బంగా రాజాం అసెంబ్లీ నియోజకవర్గ ఇంఛార్జ్ డా.రాజేష్ తలే ఆధ్వర్యంలో అనాధాశ్రమాల్లో, హాస్పిటల్లో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ మేరకు స్వయంగా తానే రక్తదానం చేసి అందరికీ ఆదర్శంగా నిలిచారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ పాల్గొన్నారు.