W.G: ప్రభుత్వం దివ్యాంగులకు పంపిణీ చేసే మూడు చక్రాల స్కూటర్ల నిబంధనలను సడలించాలని విసాస్ ఏపీ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు అల్లాడి నటరాజ్ డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఉన్న 18-45 సంవత్సరాల వయోపరిమితిని 55కు పెంచాలని, 60 శాతం వైకల్యం ఉన్నవారికి పెట్రోల్ స్కూటీలు ఇవ్వాలని ఆయన కోరారు. పోలియో కాలిపర్స్, సహాయ పరికరాలు వాడేవారికి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.