NDL: నంద్యాలలో మంగళవారం దారుణం ఘటన చోటుచేసుకుంది. ఎన్జీవో కాలనీలో సాయినాథ్ అనే వ్యక్తి తన భార్య శిరీషను గొంతు కోసి హత్య చేశాడు. ఈ ఘటనపై రెండో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. కాగా, ఈ దారుణ ఘటన స్థానికంగా కలకలం రేపింది. హత్యకు గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.