PPM: పాచిపెంట మండలంలోని కె.తాడూరు రహదారి బురదగా మారింది. తాడూరు, మాతుమూరు కూడలి వరకు రెండు కిలోమీటర్ల మేర గోతులు ఏర్పడ్డాయి. కనీసం నడిచి వెళ్లే వీలు లేకపోవడంతో ఇబ్బంది పడుతున్నామని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విషయం జేఈ శ్యామ్ ప్రసాద్ వద్ద ప్రస్తావించగా.. రూ. కోటి నిధులు మంజూరయ్యాయని, వర్షాలు ముగిసిన తరువాత పనులను ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు.