కోనసీమ: ఆత్రేయపురం మండలం వాడపల్లి వేంకటేశ్వరస్వామి ఆలయంలో అర్చకులు మంగళవారం అష్టోత్తర పూజలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల నుండి వచ్చిన భక్తులతో ఆలయంలో రద్దీ నెలకొంది. ఏడు వారాల నోము ఆచరించిన భక్తులు ఈ అష్టోత్తర పూజలను నిర్వహిస్తారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కలు చెల్లించుకున్నారు.