E.G: చాగల్లు మండల బీజేపీ ఉపాధ్యక్షులు జుట్టా గణపతి భార్య దుర్గ ఇటీవల మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న బీజేపీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు పిక్కే నాగేంద్ర, మంగళవారం ఉదయం గణపతి నివాసానికి వెళ్లి నివాళులర్పించారు. నాయకులతో కలిసి కుటుంబ సభ్యులను ఓదార్చి, ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు తాళ్లూరి వరప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.