GNTR: తురకపాలెంలో గత కొంతకాలంగా వరుస మరణాలు జరుగుతున్న విషయం తెలిసిందే. మినిస్టర్లు, ఎమ్మెల్యే, జిల్లా అధికారులు, వైద్య నిపుణులు ఇప్పటికే గ్రామంలో పర్యటించి అనేక పరిష్కారాలు గ్రామస్థులకు తెలిపారు. అయితే గ్రామంలో కొందరు బొడ్రాయి ప్రతిష్ఠాపన శాస్త్రోక్తంగా జరగకపోవడంతోనే మరణాలు సంభవిస్తున్నాయని నమ్ముతూ, మంగళవారం బొడ్రాయికి శాంతి పూజలు చేశారు.