VZM: పెనుకొండలోని ఎంజేపీ స్కూల్లో మంత్రి సవిత స్మార్ట్ ఫోన్లను ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ.. కార్పొరేట్ విద్యా సంస్థల కంటే ఎంజేపీ స్కూళ్లకు ఎక్కువ డిమాండ్ ఉందని తెలిపారు. బీసీ పిల్లలకు ఆరోగ్య భద్రతతో కూడిన నాణ్యమైన విద్య అందించడం కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. కార్యక్రమంలో జీవీ ఆంజనేయులు, బంగార్రాజు, నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.