KDP: మైలవరం మండలం దొమ్మర నంద్యాలలో జరిగిన దొంగతనం కేసులో ముగ్గురిని అరెస్టు చేసినట్లు మైలవరం SI శ్యామ్ సుందర్ రెడ్డి తెలిపారు. ఎస్సై వివరాల మేరకు.. DEC 31 రాత్రి గూడెం చెరువుకి చెందిన ఒగ్గు అనిల్, చిన్నం శ్రీనివాసులు, జక్కా నారాయణ సమూహంగా ఏర్పడి దొమ్మర నంద్యాలలో దొంగతనం చేసినట్లు ఎస్సై తెలిపారు. వీరి వద్ద రూ.56,100 నగదు స్వాధీనం చేసుకున్నారు.