E.G: పెరవలి మండలం తీపర్రు, కాకరపర్రు ఫీడర్ల పరిధిలో ఆర్డీఎస్ఎస్ పనుల నిమిత్తం ఇవాళ విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని ఈఈ నారాయణ అప్పారావు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు అజ్జరం, వెంకట్రాయపురం, సీతారాంపురం, కాకరపర్రు, తీపర్రు గ్రామాలకు ఉండదన్నారు. కావున విద్యుత్ వినియోగదారులు గమనించాలని సూచించారు.