VZM: ఆడపిల్లల ఆత్మరక్షణకు తైక్వాండో ఎంతో అవసరమని బొబ్బిలి DSP భవ్యరెడ్డి సూచించారు. సోమవారం స్దానిక ప్రైవేట్ పాఠశాలలో పది రోజులు తైక్వాండో శిక్షణను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆడపిల్లలపై జరుగుతున్న అఘాయిత్యాలను అడ్డుకునేందుకు తైక్వాండో అవసరమని, బాలికలు తప్పనిసరిగా తైక్వాండో నేర్చుకోవాలని తెలిపారు. క్రీడలతో మంచి భవిష్యత్ ఉంటుందని పేర్కొన్నారు.