VZM: ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు మంగళవారం పార్లమెంట్లో ఉపరాష్ట్రపతి ఎన్నికపై తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కూటమి అభ్యర్థి సీపీ రాధాకృష్ణ మంచి మెజార్టీతో గెలవబోతున్నారన్నారు. అలాగే ఉపరాష్ట్రపతిగా, రాజ్యసభ ఛైర్మన్గా సీపీ రాధాకృష్ణ మంచిగా రాణిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.