NDL: బండి ఆత్మకూరు(మం) ఎర్రగుంట్లలో యూరియా అందలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. నంద్యాల కలెక్టర్ కార్యాలయంలో జరిగిన PGRS కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్‌కు వినతిపత్రం అందజేశారు. రైతు స్వామి రెడ్డి మాట్లాడుతూ.. గ్రామంలోని రైతు సేవ కేంద్రంలో యూరియా పంపిణీ సక్రమంగా చేయలేదని ఆరోపించారు. 20 ఎకరాలు వరి పంట వేశామని యూరియా కొరతతో ఇబ్బంది పడతున్నట్లు పేర్కొన్నారు.