MNCL: కన్నెపల్లి మండలం ఎల్లారం గ్రామంలోని కాలనీలలో డ్రైనేజీ వ్యవస్థ లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ మేరకు స్థానిక నాయకులు MLA వినోద్ దృష్టికి సమస్య తీసుకెళ్లారు. మంగళవారం MLA ఆదేశాల మేరకు డ్రైనేజీ నిర్మాణానికి అవసరమైన స్థలాలను DE,JE ఫీల్డ్ అసిస్టెంట్లు కలిసి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు రోహిత్, సంతోష్, జలపతి, గ్రామస్థులు పాల్గొన్నారు.