మెదక్: ఈ నెల 13న జరగనున్న జాతీయ మెగా లోక్ అదాలత్ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని మెదక్ ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు విజ్ఞప్తి చేశారు. “రాజీ మార్గమే రాజమార్గం. కక్షలతో ఎటువంటి లాభం ఉండదని, కోర్టుల చుట్టూ తిరుగుతూ సమయం, డబ్బు వృథా చేసుకోవద్దు” అని అన్నారు. రాజీ పడితే ఇరువురూ గెలుస్తారని, కొట్టుకుంటే ఒకరే గెలుస్తారని స్పష్టం చేశారు.