KMM: నేలకొండపల్లిలో యూరియా పంపిణీ బుధవారం నుంచి ప్రారంభమవుతుందని మండల వ్యవసాయ అధికారి రాధ తెలిపారు. రైతులు తమ పట్టాదారు పాస్ బుక్ జిరాక్స్, ఆధార్ కార్డుతో పంపిణీ చేసే సెంటర్లకు తీసుకురావాలన్నారు. రైతురాలేని పక్షంలో కుటుంబ సభ్యులు ఓటీపీ చెప్పాలన్నారు. మంగాపురం తండా, పైనంపల్లి గ్రామాల రైతులు తమకు కేటాయించిన సెంటర్లలోనే యూరియా తీసుకోవాలని తెలిపారు.