సత్యసాయి: మడకశిర మండలం గౌడనహళ్లి పంచాయితీ రైతు సేవా కేంద్రంలో మంగళవారం రైతులకు ఎరువుల పంపిణీ జరిగింది. గోడౌన్ వద్ద అవసరమైన ఎరువులు సిద్ధంగా ఉన్నాయని అధికారులు తెలిపారు. గౌడనహళ్లి, జమ్మానిపల్లి, తురకవాండ్లపల్లి గ్రామాల రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని వీఆర్వో చరణ్, వీహెచ్ఎ అధికారిణి అనిత సూచించారు.