ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమీషనరేట్ పరిధిలో సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ నిషేధాజ్ఞలు అమలులో ఉన్నాయని, మంగళవారం ఎటువంటి నిరసన కార్యక్రమాలకు అనుమతులు లేవని విజయవాడ సీపీ రాజశేఖర్ బాబు తెలిపారు. కంచికచెర్ల పోలీసు స్టేషన్ పరిధిలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామ