చిత్తూరు: పట్టు క్రిమిసంహారక మందుల సరఫరాకు అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. జిల్లా పట్టుపరిశ్రమ ఆధ్వర్యంలో రైతులకు సున్నం, బ్లీచింగ్, అస్త్ర, వెట్కేర్, సప్లిమెంట్, పోర్ట్, గ్రీన్, సానిటిక్, ఊజిసైడ్, సురక్ష, అంకుష్ మందులు సరఫరా చేయాల్సి ఉంటుందన్నారు. ఈ మేరకు దరఖాస్తులు 11 నుంచి 18వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు.