PLD: మాచర్ల పురపాలక పరిధిలో సొంతిల్లు ఉండి వ్యక్తిగత మరుగుదొడ్లు లేని వారికి శుభవార్త. మరుగు దొడ్లు నిర్మించుకునే కుటుంబాలకు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ద్వారా రూ.15 వేలు సబ్సిడీ అందజేస్తామని మంగళవారం మున్సిపల్ కమిషనర్ డి. వేణుబాబు తెలిపారు. ఆసక్తిగలవారు వార్డు సచివాలయంలోని ఎమినిటీస్ కార్యదర్శిని సంప్రదించి దరఖాస్తులను ఈ నెల 17లోగా సమర్పించాలన్నారు.