NLR: వెంకటాచలం మండలంలోని కాకుటూరు విక్రమ సింహపురి విద్యాలయ ప్రాంగణంలో సోమవారం జాతీయ విద్యా విధానంపై అవగాహన ర్యాలీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని రిజిస్టర్ సునీత జెండాను ఊపి ప్రారంభించారు. జాతీయ విద్యా విధానం విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి దోహదపడుతుందని, ఈ సందర్భంగా తెలియజేశారు. కార్యక్రమంలో సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.