ప్రకాశం: కంభం పట్టణంలో పోలీస్ 30 యాక్ట్ అమలులో ఉందని ఎస్సై నరసింహరావు సోమవారం రాత్రి ఓ ప్రకటనలో తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పట్టణ ప్రాంతంలో సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహించరాదని అలా నిర్వహిస్తే చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అదేవిధంగా మంగళవారం జరిగే వైసీపీ పార్టీ అన్నదాత పోరు కార్యక్రమానికి ఎటువంటి పర్మిషన్ ఇవ్వలేదని అన్నారు.