NLG: రైతులకు యూరియా సరఫరాలో ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం కొత్త ప్రాణాళికను సిద్ధంచేసింది. ఎరువుల దుకాణాల వద్ద రద్దీని తగ్గించడానికి, రైతు వేదికల నుంచి యూరియాను విక్రయించనున్నారు. జిల్లాలో ఎంపిక చేసిన 34 వేదికల్లో ఇప్పటికే నిల్వలు అందుబాటులో ఉంచారు. రైతులకు సకాలంలో ఎరువులు అందేలా చూడటం, రద్దీని తగ్గించడమే ఈ ప్రాణాళిక ప్రధాన లక్ష్యమని JDA శ్రవణ్ కుమార్ తెలిపారు.