NLG: పలు సమస్యలపై చిట్యాల తహశీల్దారు కృష్ణకు వినతులు వెల్లువెత్తుతున్నాయి. సోమవారం సీపీఐ నాయకులు వ్యవసాయ కూలీల సమస్యలపై, సీపీఎం నేతలు చిన్నకాపర్తిలో పేదలకు ఇంటి స్థలాలు పంపిణీ చేయాలని, ఎస్ఎఫ్ఐ నేతలు ప్రభుత్వ జూ. కళాశాలను ఏర్పాటు చేయాలంటూ… వినతి పత్రాలు అందించారు. అలాగే ఎంపీడీవో జయలక్ష్మికి సీఐటీయూ నేతలు జీపీ కార్మికుల సమస్యలపై వినతి పత్రం సమర్పించారు.