GNTR: మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డిని మంగళవారం పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో నరసరావుపేటలోని ఆయన ఇంటి దగ్గర పోలీసులు భారీగా మోహరించారు. అయితే కూటమి ప్రభుత్వం రైతులను ఇబ్బందులకు గురిచేస్తోందని, వైసీపీ రైతు ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించనుంది. ఈ కార్యక్రమానికి అనుమతి లేదని పోలీసులు వివరిస్తున్నారు.