E.G: ఉండ్రాజవరం కాల్దరి రైల్వే అండర్ పాస్ వద్ద సీసీ రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఆదివారం సాయంత్రం 5 గంటల నుంచి నెల రోజులపాటు రాకపోకలు నిలిపివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ప్రత్యామ్నాయంగా వెలివెన్ను గోస్తాని బ్రిడ్జి పక్క నుంచి చిలకపాడు దుర్గమ్మ గుడి వైపు ఉన్న రోడ్డు మార్గంలో వెళ్లాలని సూచించారు.