E.G: మాజీ సీఎం జగన్ ఇచ్చిన అన్నదాత పోరు పిలుపుతో కూటమి ప్రభుత్వం వణుకు పోతుందని మాజీ మంత్రి, తూ.గో జిల్లా వైసీపీ అధ్యక్షులు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ విమర్శించారు. పోలీస్ యాక్ట్ అమల్లో ఉందంటూ అన్నదాత పోరు కార్యక్రమానికి అనుమతి లేదని పోలీసులు అడ్డుకుంటున్నారని మంగళవారం తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొనవద్దంటూ రైతులను బెదిరిస్తున్నారని మండిపడ్డారు.