GNTR: క్లస్టర్ మ్యాపింగ్ మార్గదర్శకాలపై తెనాలిలోని వార్డు, గ్రామ సచివాలయ ఉద్యోగులు నిరసన వ్యక్తం చేశారు. నల్ల బ్యాడ్జీలు ధరించి తమ ఆవేదనను మున్సిపల్ ఛైర్పర్సన్, కమిషనర్లకు వినతి పత్రం ద్వారా తెలియజేశారు. ‘మనమిత్ర’ యాప్‌పై ఇంటింటి ప్రచారం తమను వాలంటీర్లుగా మారుస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. డోర్ టు డోర్ కాకుండా, వార్డులోనే ప్రచారం చేయాలని కోరారు.