VSP: విశాఖ స్టీల్ ప్లాంట్ ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయాన్ని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు స్వాగతించారు. గురువారం ఆయన విశాఖలో మీడియాతో మాట్లాడారు. ప్లాంట్‌కు సంబంధించిన రూ.2,400 కోట్ల విద్యుత్ బకాయిలను షేర్లుగా మార్చి ఊరట కల్పించడం చారిత్రాత్మక నిర్ణయమని అన్నారు.