E.G: బీజేపీ జిల్లా సోషల్ మీడియా విభాగంలో నూతన నియామకాలు చేపట్టారు. జక్కా ఫణిని జిల్లా సోషల్ మీడియా కో-కన్వీనర్‌గా గురువారం నియమించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర పార్టీ కార్యాలయంలో నియామక పత్రం అందజేసి అభినందించారు. పార్టీ సిద్ధాంతాలను, ప్రభుత్వ వైఖరిని సోషల్ మీడియాలో ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.