SKLM: జీఎస్టీ 2.0తో పేద ప్రజలకు ఎంతో మేలు అని పలాస ఎమ్మెల్యే శిరీష అన్నారు. గురువారం పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలో సూపర్ GST సూపర్ సేవింగ్ ర్యాలీను అధికారులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని, జండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీఎస్టీతో నిరుపేద కుటుంబాలకు ప్రయోజనం కలిగిందన్నారు.