KRNL: ఆలూరు పరిధిలోని హోళగుంద ఎస్సై దిలీప్ కుమార్ లిక్కర్, రేషన్, ఇసుక మాఫియాలకే మద్దతుగా ఉంటున్నారని ఎమ్మెల్యే విరూపాక్షి శనివారం కలెక్టర్ సిరికి ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ పనులకు ఇసుక సరఫరా చేస్తున్న కాంట్రాక్టర్లను భయపెడుతున్నారని ఆరోపించారు. రాజకీయాలు చేయాలంటే ఖాకీ చొక్కా తీసేసి చేయాలని మండిపడ్డారు.