NTR: తిరువూరులో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ముగ్గురు అధికారులను జిల్లా కలెక్టర్ మూడు నెలల్లో సస్పెండ్ చేశారు. ప్రజలకు సేవ చేయడంలో అవినీతికి పాల్పడినట్లు ఫిర్యాదులు అందాయి. సబ్ రిజిస్టర్ కార్యాలయ అధికారి, గత నెలలో వ్యవసాయ శాఖ ఏఈని సస్పెండ్ చేయగా, తాజాగా ఈ నెలలో మండల తహసీల్దార్‌పై కూడా సస్పెన్షన్ వేటు పడింది.