VZM: విజయనగరంలోని రింగ్ రోడ్డులో నిర్మాణంలో ఉన్న జిల్లా వైసీపీ కార్యాలయాన్ని శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ శనివారం పరిశీలించారు. జడ్పీ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామితో కలిసి కార్యాలయాన్ని సందర్శించారు. ఇటీవల కోర్టు తీర్పు అనుకూలంగా రావడంతో త్వరలో నిర్మాణ పనులు ప్రారంభిస్తామని ఆయన తెలిపారు.