NDL: రాష్ట్ర ప్రభుత్వం శనివారం రంజాన్ సందర్భంగా సెలవు ప్రకటించింది. దీంతో ఆ రోజున జరగవలసిన పదవ తరగతి ఇంగ్లీష్ పరీక్షను ప్రభుత్వం వాయిదా వేసింది. ఏప్రిల్ 2న ఇంగ్లీష్ పరీక్షను నిర్వహించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు విద్యాశాఖ అధికారులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఇంగ్లీష్ పరీక్ష వాయిదాను గమనించాలని పేర్కొంది.